BREAKING: ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను 174కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను 174కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు హాజరై మద్దతు తెలపడంతో ఏపీలో కొత్త చర్చ ప్రారంభమైంది. జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న చెల్లి షర్మిలతో కలిసి జగన్ పని చేయాల్సి ఉంటుంది.
చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయితీ ఈ నాటిది కాదన్నారు జగన్. వీళ్లద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారన్నారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి చంద్రబాబుకు కొట్టాడన్నారు. ఆ కోపంతోనే పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు పీకల్లోతూ కోపమని ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ చెప్పారు.
ధరణి సమస్యలను పరిష్కరించడానికి అందరి సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ధరణిపై నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెడుదామని, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుందామని అన్నారు.
దాదాపు ఐదు నెలలుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు కొత్త సర్పంచ్ లు రానున్నారు. వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పాత రిజర్వేషన్లనే కొనసాగించాలని ఆదేశించారు. దీంతో పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి షురూ కానుంది.
మేడిగడ్డ వద్ద ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. సంబంధం లేని సాకులతో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఏపీలోని నాణ్యత లేని మద్యం కారణంగానే మృతి చెందారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. గతేడాది ఏపీకి వచ్చిన రాకేష్ మాస్టర్ తనకు ఈ మద్యం తప్పా వేరేది దొరకలేదని చెప్పారన్నారు. ఆ రెండు రోజులకే ఆయన చనిపోయారన్నారు.
అసెంబ్లీలో గొంతు విప్పినా.. విప్పలేకపోయినా.. అసెంబ్లీ జరిగే సమయంలో ఇలానే ప్రజల తరఫున మీడియాలో మాట్లాడుతానన్నారు జగన్. దీంతో ఆయన అసెంబ్లీకి వెళ్లరా? అన్న చర్చ మొదలైంది. ప్రెస్ మీట్ల ద్వారానే జగన్ తన వాదన వినిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎక్కువ ఆదాయాన్ని చూపి ప్రజలను మోసం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. అది గ్యాస్.. ట్రాష్ కాదా? అంటూ కేసీఆర్ సర్కార్ కు కౌంటర్ ఇచ్చారు. ఇన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు.