Vinayakudu: దేశం లోనే ఎత్తైన ఏకశిలా గణపతి ఎక్కడున్నాడో తెలుసా..?
దేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి నాగర్ కర్నూలు జిల్లా ఆవంచలో కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడి వినాయకుని భక్తులు ఐశ్వర్య గణపతి గా పిలుస్తూ ఉంటారు. 25 అడుగుల ఎత్తు 17 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆవంచ గణపతికి గుండు గణపతి గా కూడా పేరు ఉంది. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం 12వ శతాబ్దం నాటిదిగా చరిత్ర చెబుతోంది.