Abhishek Singhvi: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. సింఘ్వీ తరఫున సీనియర్ నేత నిరంజన్ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.