![TG News: ఖమ్మంలో పగిలిన తలలు.. తీవ్ర ఉద్రిక్తత](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/khammam.jpg)
Khammam: ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్‌లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న భూ నిర్వాసితులకు, ప్రైవేటు యజమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తమ భూముల్లో ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను ఖాళీ చేయాలని భూయజమానుల అనుచరులు డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా భూ ధాన్ భూముల్లోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నామంటున్న నిర్వాసితులు వీరితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో పలువురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గుడిసెల తొలగిపు ఆపకపోతే ప్రాణాలైనా అర్పిస్తామని నిర్వాసితులు తేల్చిచెబుతున్నారు.
ఇది కూడా చదవండి: కీరాతో ఎన్నో లాభాలు.. ఓ లుక్కేయండి!