Nitin Gadkari : మంచి పనులు చేసే వాళ్లకి గౌరవం దక్కడం లేదు: నితిన్ గడ్కరీ
రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాటిని పట్టించుకోకుండా.. అధికారంలో ఉన్న పార్టీతో కలిసి వెళ్లాలనుకుంటున్న రాజకీయ నాయకుల వైఖరి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు.