AP: నిబంధనలు పాటించకుండా ఇలా చేశారు.. టీడీపీపై ముక్కాల ద్వారక నాధ్ ఫైర్..!
అధికార బలంతో తనను నిర్బంధించారన్నారు నెల్లూరు కన్యక పరమేశ్వరి ఆలయ మాజీ చైర్మెన్ ముక్కాల ద్వారక నాధ్. తన పదవి కాలం ఉండగానే కొంతమంది ఆలయ కమిటీ చైర్మెన్‌గా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా టీడీపీ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.