Telangana: ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
తెలంగాణలో త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కరీంనగర్ - హైదరాబాద్, నిజామాబాద్ - హైదరాబాద్ మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ డిపోలకు ఈ బస్సులు చేరుకున్నాయి.