నారా ఫ్యామిలీకి క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపిన వైఎస్ షర్మిల.. లోకేష్ రిప్లై వైరల్
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీడీపీ నేత నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ గ్రీటింగ్స్ పంపించారు. లోకేష్ థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు.