హైదరాబాద్‌ను వదలని వాన.. నీట మునిగిన ఆస్పత్రి
హైదరాబాద్‌ను వర్షం వదలడం లేదు. నగరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నాంపల్లిలోని పసకల ఆస్పత్రి నీటమునిగింది. దీంతో పచ్చకామెర్ల వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
హైదరాబాద్‌ను వర్షం వదలడం లేదు. నగరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నాంపల్లిలోని పసకల ఆస్పత్రి నీటమునిగింది. దీంతో పచ్చకామెర్ల వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 3986 పోలింగ్ ష్టేషన్లు ఉన్నాయి. మొత్తం 43 లక్షల 989 మంది ఓటర్లున్నట్టు ఎన్నికల విభాగం డ్రాఫ్ట్ లో వెల్లడించింది. ఇందులో 20 లక్షల 90 వేల 727 మంది మహిళలున్నారు. 22 లక్షల 9 వేల 972 మంది పురుషులున్నారు. ఇక అన్ని నియోజక వర్గాల్లో కలిపి 290 థర్డ్ జండర్ ఓట్లున్నాయి.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు.