Greater Hyderabad Voters List: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఓ వైపు అధికార ప్రతిపక్షాలు తమ తమ గెలుపు గుర్రాలు బరిలోకి దింపుతుంటే.. మరోవైపు అభ్యర్థుల అదృష్టాలను డిసైడ్ చేసే ఓటర్ల లిస్ట్ ను ఎన్నికల సంఘం (Election Commission) ఫైనల్ చేసే పనిలో దూసుకెళుతోంది. ఓటరు జాబితాలో సవరణ ప్రక్రియను చేపట్టిన ఎన్నికల వింగ్ తాజాగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేసింది. మరి దీని ప్రకారంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 15 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంత మంది ఓటర్లున్నారు..అందులో పురుషులు ఎంత మంది.. మహిళలు ఎంత మందో తెలుసా..!
పూర్తిగా చదవండి..Greater Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో ఎంత మంది ఓటర్లున్నారంటే!!
హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 3986 పోలింగ్ ష్టేషన్లు ఉన్నాయి. మొత్తం 43 లక్షల 989 మంది ఓటర్లున్నట్టు ఎన్నికల విభాగం డ్రాఫ్ట్ లో వెల్లడించింది. ఇందులో 20 లక్షల 90 వేల 727 మంది మహిళలున్నారు. 22 లక్షల 9 వేల 972 మంది పురుషులున్నారు. ఇక అన్ని నియోజక వర్గాల్లో కలిపి 290 థర్డ్ జండర్ ఓట్లున్నాయి.
Translate this News: