సామాన్యులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు..!!
దేశంలో వంటనూనె దిగుమతులు భారీ స్థాయిలో పెరిగాయి. పామ్ ఆయిల్ దిగుమతులు వార్షికంగా చూస్తే భారీగా పెరిగాయి.దీంతో దేశంలోని సామాన్యులకు ఊరట కలిగించే ఛాన్స్ ఉంది.
దేశంలో వంటనూనె దిగుమతులు భారీ స్థాయిలో పెరిగాయి. పామ్ ఆయిల్ దిగుమతులు వార్షికంగా చూస్తే భారీగా పెరిగాయి.దీంతో దేశంలోని సామాన్యులకు ఊరట కలిగించే ఛాన్స్ ఉంది.
పీఎం కిసాన్ 15వ విడత నిధి విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే డబ్బు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తైన రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఛత్తీస్ ఘడ్ లో మరో రెండు రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘేల్ కు రూ.508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
పెట్టుబడిదారులు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఆరు నెలలకు సుమారు రూ.40,000 వడ్డీ వస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన బాండ్స్‌పై పెట్టుబడి పెట్టే వారికి రిస్క్ లేని రాబడి లభిస్తుంది. అయితే వడ్డీ రేట్లపై ప్రతి ఆరు నెలలకు జనవరి 1, జూలై 1న సమీక్ష చేయడం జరుగుతుంది.
2000 నోటును రద్దు చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు మళ్లీ రూ. 1000 నోట్లను వినియోగంలోకి తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లోకం కోడై కూస్తోంది. రూ. 2000 నోటు రద్దు వెనుక కారణం ఇదేనంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇదే హింట్స్ ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వరుస పుకార్లతో సామాన్య ప్రజలు మళ్లీ కన్ఫ్యూజన్లో పడిపోయారు.
ఆంధ్రాలోని విశాఖపట్నంలో రూ.1.30 కోట్లు హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్ మిషన్ లో భారీ కరెన్సీ నోట్ల కట్టలను విజయవాడకు వ్యాన్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో పాటూ 30 సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
క్రెయిగ్, కరెన్ మిచెల్ అనే జంటకు నేషనల్ లాటరీలో జాక్‌పాట్ గెలుచుకున్నారు. 53 ఏళ్ల వయసులో ఈ జంటకు రూ. 10 కోట్లు లభించింది. అయితే, ఈ జంట వచ్చిన డబ్బును అస్లసు ఖర్చు చేయబోమని, విలాసాలకు వినియోగించబోమని తెలిపారు. ఆ డబ్బుతో వీరు ఒక్క బెడ్ షీట్ మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా తాము రోజూలాగే జీవిస్తామని చెబుతున్నారు.
చెన్నైలోని ఓ ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఇద్రిస్ ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. అంత డబ్బు అకౌంట్లో పడినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. కాసేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకుని.. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. జరిగి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపజేసింది.