Mamata Benarjee: మా రాష్ట్రం పేరును అలా మార్చండి.. సీఎం మమతా బెనర్జీ డిమాండ్..
తమ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం చూస్తే.. జాబితాలో తమ రాష్ట్రం పేరు చివర్లో ఉందని తెలిపారు. దీనివల్ల సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు చివరి వరకు ఆగాల్సి వస్తుందని తెలిపారు.