CM Revanth Reddy: మహబూబ్‌నగర్‌కు మహర్దశ.. రూ. 396.09 కోట్ల పనులకు శంకుస్థాపన!

రూ. 396.09 కోట్లతో మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి క్యాంటీన్, మున్సిపాలిటీ, పాలమూరు యూనివర్సిటీ, బాలికల హాస్టల్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు.

New Update
CM Revanth Reddy: మహబూబ్‌నగర్‌కు మహర్దశ.. రూ. 396.09 కోట్ల పనులకు శంకుస్థాపన!

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుండగా.. మహబూబ్ నగర్ పట్టణంలోనే రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో అభివృద్ధి పనులు, మహిళా శక్తి క్యాంటీన్, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంతోపాటు మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.

అలాగే గండీడ్ లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణం, పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులను మొదలుపెట్టారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు