LK Advani : ఆసుపత్రిలో చేరిన సీనియర్ నేత అద్వాణీ!
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీ అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.