Lok Sabha Elections: మా ఊరికి ఓట్లు కోసం రాకండి.. నోటాకు ఓట్లు వేస్తాం..
కేరళలోని కన్నూర్‌లో నడువిల్లి గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు రావొద్దంటూ గ్రామస్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే.. ఎన్నికల్లో పాల్గొంటామని లేకపోతే నోటాకు ఓట్లు వేస్తామంటున్నారు.