Baby Born in Bus: బస్సులోనే ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డా క్షేమం! బస్సులోనే గర్భిణికి ప్రసవం జరిగిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటినొప్పులు రావడంతో.. ఆ బస్సు డ్రైవర్ బస్సును వేరే మార్గంలోకి మళ్లించి ఆసుపత్రికి చేర్చాడు. సమయం లేకపోవడంతోనే వైద్య సిబ్బంది ఆమెకు బస్సులోనే డెలివరీ ఏర్పాట్లు చేశారు. By KVD Varma 30 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Baby Born in Bus: నిండు గర్భిణీ.. బస్సులో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో స్పందించడంతో ఆమెకు బస్సులోనే ప్రసవం అయింది. కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ నుంచి కొలిక్కొడ్ వెళుతున్న కేఎస్‌ఆర్‌టీసీ Baby Born in Bus: కేరళలోని మలప్పురానికి చెందిన ఓ నిండు గర్భిణి తన భర్తతో కలిసి బస్సులో త్రిసూర్ నుంచి కొలిక్కోడ్‌కు వెళుతుండగా ప్రసవ వేదనకు గురై అక్కడే ప్రసవించింది. వారు ఆ బస్సులో తొట్టిలపాలెం వెళ్తున్నారు. దారిలో ఆమెకు నొప్పి ఎక్కువై కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో డెలివరీ అయింది. బస్సు పెరమంగళం మీదుగా వెళ్తుండగా ఆ మహిళకు తీవ్ర ప్రసవ వేదనలు వచ్చాయి. దీంతో బస్సు డ్రైవర్ బస్సు రూట్ మార్చి.. ఆ దారిలో ఉన్న అమల హాస్పిటల్ వైపు తీసుకువెళ్లాడు. దారిలో ఆ గర్భిణికి మరింత ప్రసవవేదన ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి చేరుకునే సరికే ఆమెకు 80శాతం ప్రసవం అయిపొయింది. Also Read: వామ్మో ఇదేం గాలిరా బాబు…ఏకంగా విమానాన్నే..! Baby Born in Bus: ముందుగానే ఆసుపత్రికి డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రి వద్ద సిబ్బంది అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉన్నారు. దీంతో బస్సు ఆగిన వెంటనే ప్రయాణీకులను అందరినీ కిందకు దించి వైద్యులు ఆమెకు డెలివరీ ప్రక్రియను పూర్తి చేశారు. ఆమెకు పండంటి ఆడపిల్ల పుట్టింది. తరువాత తల్లిని బిడ్డను వేరుచేసి.. ఐసీయూలో చేర్పించారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రిలోని డాక్టర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక పత్రిక తేజాస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. సకాలంలో స్పందించి సరైన నిర్ణయం తీసుకున్న బస్సు డ్రైవర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. #kerala-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి