MLC Kavitha : రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లు సంయుక్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నాయి.