Isarael-Iran: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్
పశ్చిమాసియా దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌కు తాము ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇరాన్ చేసిన దాడిలో దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులు కూల్చివేశామని చెప్పారు.