కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్ బై.?
TG: కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ మహేష్ కాల్ కట్ చేశారు.
జీవన్‌రెడ్డి విషయంలో పీసీసీదే తప్పని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ సమన్వయ లోపం కారణంగానే గందరగోళం నెలకొందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక గురించి ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం తప్పేనన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్‌ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని తెలిపింది.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్.. బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మాల్ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రీఓపెన్ అయ్యింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం అద్దె బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.