Telangana Elections: తెలంగాణ స్పూర్తితోనే ఏపీలో గుండాలను, రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్ కళ్యాణ్
తెలంగాణ ఉద్యమ పోరాట స్పూర్తితోనే ఏపీలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీకి జనసైనికులు వారికి మద్దతివ్వాలని కోరారు.