JanaSena VeeraMahila : స్త్రీ అన్ని విధాలా దగాకి గురవుతుందనేది వాస్తవం: పవన్ కళ్యాణ్
ఆగష్టు 15 సందర్భంగా జనసేన వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజలందరికీ జనసేన పక్షాన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మహానుభావులు, మేధావుల త్యాగాలతోనే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని చెప్పారు. ఇటువంటి చరిత్రలు, మహానుభావులు త్యాగాలు అందరూ తెలుసుకోవాలని సూచించారు. అలాగే పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించాలని కోరుకుంటున్నాని చెప్పారు. తాము భవిష్యత్తులో మగువలకు సరైన స్థానం, రక్షణ కల్పిస్తామని చెప్పారు. అతని ఇంట్లో ఆడవాళ్లు, కుటుంబం ఉంది కదా అని గుర్తు చేశారు. స్త్రీల కట్టు, బొట్టును అవమానించినా ప్రభుత్వం పట్టించుకోదా అని... ఈ పాలకులకు రాజకీయమే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదన్నారు. దిశ చట్టాలు, స్పందన పెట్టి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. . సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు వంటి వారి స్పూర్తి తో జనసేన బలంగా పోరాటాలు చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.