ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేండ్లు... అమర్ నాథ్ యాత్ర రద్దు...!
అమర్ నాథ్ యాత్రను అధికారులు శనివారం తాత్కాలికంగా నిలిపి వేశారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేండ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా యాత్రను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.