AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కీలక బిల్లులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కాగ్ తన నివేదికలో పరోక్షంగా తెలిపింది. రాజధాని కోసం భూ సేకరణ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. అలాగే జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల చేయడం వల్ల నిధులు నిరుపయోగం అయ్యాయని కాగ్ తన నివేదికలు తేల్చి చెప్పింది.
ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గడగడపకూ మన ప్రభుత్వం మీద పార్టీ నేతలు, సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. ఇందులో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో బయటపెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఓ వీడియో విడుదల చేశారు.
చంద్రబాబు అరెస్ట్‌పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. దీని వెనుక ఉన్న కేసీఆర్, మోడీ పాత్రలపై తమ వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉందన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై విజయవాడలో మరోసారి టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. నిన్న జగన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడారని బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పెద్ద గజ దొంగ... 42వేల కోట్లు ఈడీ జప్తు చేసిందన్నారు. చార్లెస్ శోభరాజ్ లాగా జగన్‌ను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబును ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి.
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.