Imran Khan: ప్లే బాయ్ ని దైవ భక్తునిగా మార్చిన బుష్రా బీబీ ఎవరు? బ్లాక్ మ్యాజిక్ తో పాక్ రాజకీయాలనే మార్చేసిందా? అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీ అసలు ఎవరు? ఇమ్రాన్ ఆమెను తన ఆధ్యాత్మిక నాయకురాలని ఎందుకు పిలుస్తాడు? బ్లాక్ మ్యాజిక్ తో ఆమె పాక్ రాజకీయాలనే మార్చేసిందా? ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By srinivas 31 Jan 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Imran Khan Wife Bushra Bibi: అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మూడో భార్య బుష్రా బీబీ (Bushra Bibi) అసలు ఎవరు? పెళ్లికి ముందు యుక్త వయసులో జల్సా రాయుడిగా ఉన్న ఇమ్రాన్ లైఫ్ స్టైల్ ను ఊహించని రీతిలో మలుపు తిప్పడంలో ఆమె కీలక పాత్ర పోషించిందా? అసలు ఇస్లాంనే కాదు.. ఏ మతాన్ని విశ్వసించని ఇమ్రాన్ ఖాన్ ఆమె కారణంగానే దైవ భక్తుడిగా మారిపోవడానికి కారణం ఆమె బ్లాక్ మ్యాజిక్ (Black Magic) అనే చర్చలు నిజమేనా? ఇమ్రాన్ ఖాన్ తరచూ ఆమెను తన ఆధ్యాత్మిక నాయకురాలని ఎందుకు పిలుస్తాడో తెలుసా? ఈమేరకు బుష్రా కు 14 ఏళ్ల జైలు శిక్ష పడటంతో ఆమె వ్యక్తిగత విషయాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పంజాబ్ రాష్ట్రం.. ఈ మేరకు పంజాబ్‌లోని (Punjab) భూ యజమానుల కుటుంబానికి చెందినది బుష్రా బీబీ రియాజ్ వాట్టోగా జన్మించిన ఆమె.. వివాహం తర్వాత తన పేరును ఖాన్‌గా మార్చుకుంది. ఆమెను సాధారణంగా బుష్రా బీబీ లేదా బుష్రా బేగం అని పిలుస్తారు. ఆమె ఇస్లాం ఆధ్యాత్మిక రూపమైన సూఫీయిజం పట్ల భక్తికి ప్రసిద్ధి చెందింది. సాధువు పట్ల బుష్రా భక్తిని మెచ్చుకున్న పాకిస్థానీయులు ఆమెను ఆధ్యాత్మిక నాయకురాలిగా పిలుస్తున్నారు. ఆమె మొదటి వివాహం రాజకీయంగా ప్రభావవంతమైన పంజాబ్ కుటుంబానికి చెందిన కస్టమ్స్ అధికారి ఖవార్ ఫరీద్ మనేకాతో కోన్నేళ్ల పాటు సాగింది. అయితే 2018లో అతనితో విడాకుల తీసుకున్న బుష్రా గురించి.. ఖవార్ పాకిస్తానీ మీడియా ఇలా పేర్కొన్నాడు. 'నా మాజీ భార్య బుష్రా బీబీ (Bushra Bibi) గురించి నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఆమె అంత పవిత్రమైన స్త్రీని నేను ప్రపంచంలో చూడలేదు' అన్నాడు. అలాగే ఆమె కళ్లు తప్పా, తన మొహం బయటి ప్రపంచానికి అరుదుగా చూపిస్తుందని, ఇస్లాంను ఇంత పవిత్రంగా పాటించిన వ్యక్తిని ఫస్ట్ టైమ్ చూసినట్లు ఖవార్ తెలిపాడు. ఇది కూడా చదవండి: Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష బ్లాక్ మ్యాజిక్.. అయితే బీబి రియాజ్ చేతబడులు చేస్తుందని, ఇమ్రాన్ ఖాన్ సైతం అదే మాయతో పూర్తిగా మార్చేసిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఆమె చేతులు పట్టుకుంటే ఎంతటివారైనా మారిపోతారనే ఒక అపోహ కూడా ప్రచారంలో ఉంది. కొంతమంది ఆమె చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వాదనను ఇమ్రాన్ ఖాన్ పదేపదే ఖండించారు. 'ప్రజలు దేవుడు, ప్రవక్తతో సన్నిహితంగా ఉండటానికి నన్ను చూడటానికి వస్తారు' అని ఆమె ఇటీవల ఓ ఇంటర్వూలోనూ చెప్పింది. ఇక ఖాన్ బుష్రాను ఎప్పుడు, ఎలా కలిశారో స్పష్టంగా తెలియలేదు. కానీ అయితే మాజీ సహాయకుడు ఔన్ చౌదరి ఖాన్ ఆమె ఆధ్యాత్మికతతో చాలా ఆకట్టుకున్నారని చెప్పారు. 1990లలో తన క్రికెట్ కెరీర్ ప్రారంభమైనప్పుడు ప్లేబాయ్ ఇమేజ్‌ని సంపాదించుకున్న ఖాన్.. గతంలో తనకు సూఫీయిజం పట్ల ఆసక్తి లేదని చెప్పాడు. కానీ 2018లో ప్రధానిగా ఎన్నిక కావడానికి ఏడు నెలల ముందు వివాహం చేసుకున్న ఖాన్ పూర్తిగా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆధ్యాత్మిక ప్రయాణం.. ఎన్నడూ నమాజ్ చేయని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan).. ప్రధానిగా ఎన్నిక కావడానికి కొన్ని నెలల ముందు బాబా ఫరీద్ మందిరం వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న జంట ఫొటోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడిన బుష్రా.. 'ఇమ్రాన్ ఖాన్ జీవితంలోని ప్రతి క్షణం ఇప్పుడు దేవుడు.. ప్రవక్త, బాబా ఫరీద్ పట్ల ప్రేమకు అంకితం చేయబడింది' అని స్వయంగా చెప్పింది. ఇక ఎప్పుడూ కళ్ళు మాత్రమే కనిపించే బురఖా ధరించి బహిరంగంగా కనిపించే బుష్రా.. భర్తతో సౌదీ అరేబియా సందర్శనకు తప్పా.. ఇంత వరకూ ఎలాంటి అధికారిక విదేశీ పర్యటనలకు వెళ్లలేదు. అల్-ఖాదిర్ ట్రస్ట్. ఇస్లామాబాద్ లో ఆధ్యాత్మికత, ఇస్లామిక్ బోధనలకు అంకితమైన విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్న ప్రభుత్వేతర సంక్షేమ సంస్థ అయిన అల్-ఖాదిర్ ట్రస్ట్‌ను స్థాపించడంలో బుష్రా ఖాన్ కీలక పాత్ర పోషించారు. #imran-khan #bushra-bibi #life-history సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి