ఇంటర్నేషనల్ ఇమ్రాన్ ఖాన్కు షాక్..తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పెద్ద షాక్ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయన్ని దోషిగా ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్దారించింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఇమ్రాన్ ఖాన్కు రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు పాక్ ప్రభుత్వానికి లభించిన విలువైన బహుమతులను విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేశారు. పాకిస్తాన్లో ఉండే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాధికారులు లభించే బహుమతులను తోషాఖానా శాఖలో భద్రపరుస్తారు. By Vijaya Nimma 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn