Telangana : నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.