MP Raghuram krishna raju: రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ. అలాగే పర్యాటకం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయన్ని కడుతున్నారని విమర్శించారు. రుషి కొండలో కడుతున్న గెస్ట్ హౌస్ లను జగన్ దంపతులు సొంతం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ.