Fire : హోమగుండంలో అపశృతి.. అగ్నికి ఆహుతైన పూజా సామగ్రి, విగ్రహాలు.!
ప్రకాశం జిల్లా సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది. హోమగుండం పూజా కార్యక్రమంలో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి, విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మంటలను అదుపు చేయలేక పోయారు.