Daniel Balaji: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు బాలాజీ హఠాన్మరణం
ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం చెందారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.