Haryana: హర్యానాలో బోల్తాపడిన బస్సు..ఆరుగురు చిన్నారులు మృతి
హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు.
హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్ లో ఉద్యోగాల కోసం హర్యానా నుంచి 530 మంది యువకులు వెళ్లారు. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన హర్యానా ప్రభుత్వానికి వారు కృజ్జతలు తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకోవటంతో అక్కడ ఉద్యోగుల కొరత ఏర్పడింది.
కోడిగుడ్డు కూర వండి పెట్టను అన్నందుకు మద్యం మత్తులో సహాజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు ఓ వ్యక్తి. సుత్తి, బెల్ట్ తో తీవ్రంగా కొట్టడంతో మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.మనోహర్ లాల్ ఖట్టర్ సహా ఆయన మంత్రివర్గం రాజీనామా చేసింది.
రాజస్థాన్‌కు చెందిన సందీప్ అనే గ్యాంగ్‌స్టర్‌కు అక్కడి హైకోర్టు పెళ్లి చేసుకునేందుకు మార్చి 12న ఆరు గంటల పాటు పెరోల్ ఇచ్చింది. అతడు చేసుకుబోయే హర్యాణాకు చెందిన అనురాధ చౌదరీ అనే మహిళ కూడా జైలుశిక్ష అనుభవించి కొంత కాలం క్రితం బెయిల్‌పై విడుదలైంది.
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ హత్యకు గురయ్యారు. ఆదివారం గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిగిపారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో పార్టీ కార్యకర్త కూడా ఈ దాడిలో మరణించారు. ఢిల్లీ సమీపంలోని బహదూర్ ఘర్ లో ఈ ఘటన జరిగింది.
శంభు సరిహద్దు వద్ద రైతులు అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు,వీడియోలను విడుదల చేశారు.కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తుండగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు.
హర్యానాలో గణతంత్ర వేడుకల సదర్బంగా ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీరాముడికి సంబంధించిన నృత్య ప్రదర్శనను మెచ్చుకున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి ఆ కళాకారుల వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హర్యానాలోని భివానీలో న్యూ బసుకినాథ్ రామ్‌లీలా కమిటీ డ్రామా నిర్వహించింది. ఈ నాటకంలో హనుమంతుడి పాత్రలో ఉన్న హరీష్‌కుమార్ గుండెపోటుతో మరణించారు. హరీష్ 25 ఏళ్లుగా కమిటీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు.