TG News: కేంద్రం ఇచ్చినా రూ.850 కోట్లు ఏం చేశారు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇచ్చిన రూ.850 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని, బీఆర్ఎస్ తట్టి లేపితే గానీ సర్కార్ లేవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.