Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగుతోంది. దాంతో పాటూ ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం పెరుగుతోంది. కాసేపట్లో ఇది 43 అడుగులకు చేరనుంది. మరోవైపు వరద నీరు రోడ్ల మీదకు రావడం వలన ఛత్తీస్గఢ్, ఒడిశాకు రాకపోకలు బంద్ అయ్యాయి.
భారీ వర్షాలతో గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో గోదావరికి ఎర్రనీరు చేరుతోంది. పులస చేప కోసం మత్స్యకారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఒక్క పులస పడితే పండగే అంటున్నారు. వీటి ధరలు వేలల్లో పలుకుతాయని చెబుతున్నారు.
డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా.. మరోకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
ఏపీలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని అందరూ కలిసి యానాంకు వచ్చారు. సరదాగా గడిపిన తర్వాత గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులు ఉండగా, శనివారం ఉదయానికి నీటి మట్టం మరో అడుగు పెరిగింది. ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది.