Ganesh Immersion : హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు..ఎప్పటివరకు పూర్తవుతుందంటే..!!
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం ఎంతో కోలాహాలంగా కొనసాగుతోంది. నగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన లంబోదరుడి శోభాయాత్ర..రాత్రంతా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు శోభాయాత్ర కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్ పై కిలోమీటర్ల మేర గణనాథులు నిమజ్జనానికి వేయింటింగ్ లో ఉన్నాయి. రాత్రంతా భారీ వర్షం కురిసినా..వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు నిమజ్జనంలో పాల్గొన్నారు. 11రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ తోపాటు వంద చోట్లు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది.