Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమె ఇంట్లో దేవుడికి హారతి ఇస్తుండగా ఆమె చున్నీకి మంటలు అంటుకున్నాయి.కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు.