పొంగిపొర్లుతున్న మున్నేరు వాగు.. జలదిగ్భందంలో గ్రామాలు
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల రైతులు తీవ్ర నష్టపోయారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల రైతులు తీవ్ర నష్టపోయారు.
రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ పలు ప్రాంతాలకు వర్షాల వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆరా్ జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు బ్రిడ్జి పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణలోని వైరా, ఆంధ్రలోని జగ్గయ్యపేటకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం అతని కుటుంబ సభ్యులు పెద్ద సాహసాన్నే చేశారు. నిండుకుండలా పొంగుతున్న వాగును ప్రాణాలకు తెగించి ఈదుకుంటు దాటాల్సి వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో చోటు చేసుకుంది.