Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
నేపాల్ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు, యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక అస్సాంలో మే నుంచి జులై 10 వరకు వరదలతో చనిపోయిన వారి సంఖ్య 79కి చేరింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్‌లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి నదులు ప్రవహిస్తున్నాయి. అసోంలో వరదల కారణంగా ఇప్పటివరకు మొత్తం 92 మంది మృతి చెందారు.
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. గర్వాల్‌లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చెప్పారు.
వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తాజాగా ఆరుగురు మృతి చెందారు.వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 62 కి చేరింది. 29 జిల్లాల్లో 21 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి.దీంతో మొసళ్లు రోడ్లపై దర్శనమిస్తూ, వాహనదారులను భయానికి గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షం కురవడంతో.. ఓ మొసలి నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది.
భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలో కార్లు కొట్టుకుపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోట్ద్వార్ ప్రాంతంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.