ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.