నాగులపల్లి లో చిరుత | Leopard in Nagulapalli - AP |RTV
నాగులపల్లి లో చిరుత | Leopard sightings in Nagulapalli village in Andhra Pradesh. Villagers step back to walk on the roads to perform their day to day activities |RTV
నాగులపల్లి లో చిరుత | Leopard sightings in Nagulapalli village in Andhra Pradesh. Villagers step back to walk on the roads to perform their day to day activities |RTV
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి ఆళ్లనాని, మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా వైసీపీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ బుడమేరు వరద నీరు అంతా కొల్లేరులోకి చేరుతుండడంతో కొల్లేరు ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. దీంతో కైకలూరు-ఏలూరు రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరును దాటే ప్రయత్నం ఎవరూ చేయోద్దని పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు.
ఏలూరు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ దంపతులు మంగళవారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయం గురించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చలు జరిపినట్లు సమాచారం.వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ఓ ట్రైన్ కి మరో స్టాప్ అదనంగా చేరింది. సికింద్రాబాద్ -విశాఖపట్నం- సికింద్రాబాద్ ట్రైన్ ఇక నుంచి ఏలూరులో కూడా ఆగనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఓ వాహన డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న మంత్రి కారు దానిని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తోండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వాగు దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం.