Sachin Tendulkar: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్ మార్క్ 'ఆయుధ పూజ' ఇది!
క్రికెట్‌ను ప్రాణంగా భావించే సచిన్.. ఆట పట్ల తనకున్న ప్రేమను మరోసారి చూపించాడు. దసర సందర్భంగా ఆయుధ పూజ వేళ.. 'బ్యాట్-బాల్' ని దేవత ముందు పెట్టి పూజ చేశాడు సచిన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'బంతి బౌండరీ దాటినట్లే, చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.. సరైన మార్గం కోసం బ్యాటింగ్ చేస్తూ ఉండండి' అని అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు క్రికెట్ గాడ్.