Drunk And Drive : డ్రంకన్ డ్రైవ్ నిందితులకు వినూత్న శిక్ష.. ఆసుపత్రిలో ఇలా చేయాల్సిందే..!
తాండూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు వినూత్న రీతిలో శిక్ష విధించింది. జరిమానాతో పాటు ₹1000 పండ్లు కొనుగోలు చేసి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అందజేయాలని తీర్పు ఇచ్చింది. నలుగురు నిందితులు 30 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు.