Drunkers : మందుబాబుల కోసం డ్రాపింగ్‌ వ్యాన్...కలెక్టర్ కి వినతి పత్రం!

ఏపీలో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు కీర్తి రాంప్రసాద్‌ మందు బాబుల కోసం ఉచిత డ్రాపింగ్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌ వెట్రిసెల్వి కి వినతి పత్రం అందించారు.

New Update
drinkers

Eluru :  ఏపీ ప్రభుత్వం మద్యం షాపుల లాటరీలు తీసి నేటి నుంచి అమ్మకాలు మొదలు పెట్టడంతో మందు బాబులు మంచి ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో మందుబాబుల గురించి ఓ బీజేపీ నేత మద్యం తాగే వారికి ఉచిత డ్రాపింగ్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయాలంటూ ఏకంగా కలెక్టర్‌ కి వినతి పత్రం అందజేశారు. 

Also Read:  దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్!

బీజేపీ కిసాన్‌ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు కీర్తి రాంప్రసాద్‌ మందు బాబుల కోసం ఉచిత డ్రాపింగ్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి కి వినతి పత్రం అందించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మందు బాబులు కేవలం డ్రాపింగ్‌ ఏంటి పికప్‌ కూడా కావాలంటున్నారు. 

Also Read:  నేడు కోర్టుకు సీఎం రేవంత్..కానీ!

AP New Liquor Policy : నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. ఏపీలో మద్యం షాపుల లాటరీ పూర్తికావడంతో షాపుల కేటాయింపు జరుగుతోంది. నేటి నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న బ్రాండ్లన్నీ తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో 99 రూపాయలకే ఇవ్వాలని భావించిన క్వార్టర్ బాటిల్ మద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read:  ప్రియాంక చోప్రా భర్తకు ప్రమాదం..? షో మధ్యలోనే పారిపోయిన నిక్!

గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం భారీ ధరలతో మందుబాబులు అల్లాడిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ మద్యాన్ని రూ.99కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాలుగు జాతీయ కంపెనీలతో వీటి సరఫరా కోసం చర్చలు జరుపుతోంది. అయితే ఎంత స్టాక్ తీసుకోవాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆరంభంలో ఓ 2 లక్షల కేసులు తీసుకుని ఆ తర్వాత మిగిలిన స్టాక్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

Also Read:  వేణు ఎల్లమ్మ మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఆ కుర్ర హీరో ఎవరంటే?

కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా క్వార్టర్‌ రూ.99 ధరతో మద్యం అందుబాటులోకి తెస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా వారంలోపు దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.99కే క్వార్టర్ బాటిల్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోనూ సప్లై చేస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి తొలుత 2 లక్షల కేసులు తీసుకోబోతున్నారు. అనంతరం మందుబాబుల స్పందన చూసి తర్వాత స్టాక్‌కు ఆర్డర్ పెట్టబోతున్నారు.

మరోవైపు మద్యం ధరల విషయంలోనూ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిటీని నియమించబోతోంది. ఇప్పటికే ఉన్న మద్యం బాటిళ్ల ధరలను ఈ కమిటీ సవరించి ఫైనల్ చేస్తుంది. ఇందులో పాత బ్రాండ్ల ధరల సవరణతో పాటు కొత్త బ్రాండ్ల ధరల నిర్ణయం కూడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కమిటీ నిర్ణయించిన కొత్త ధరల మేరకే విక్రయాలు జరగబోతున్నాయి.  ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. 

ప్రతి షాపులోనూ డిజిటల్‌ పేమెంట్స్‌..

ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా నిర్ణయం తీసుకుంది సర్కార్. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్ధతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు