G20 Summit : ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఖలిస్థాన్ నినాదాలు..జీ20 సమావేశాల వేళ టెన్షన్..!!
సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూల నుంచి విదేశీ అతిథులు ఢిల్లీకి రానున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కలకలం రేపుతున్నాయి. సిక్కు ఫర్ జస్టిస్ అనే నినాదాలను మెట్రో స్టేషన్ గోడలపై రాసారు. దీనిపై ఢిల్లీ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాది ఢిల్లీలో ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీకి సంబంధించి ఇది రెండో సంఘటన.