రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఫస్ట్ అప్ లోడ్ చేసింది ఇతడే.. వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు వేగం పెంచారు. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడి ఖాతా నుంచే ఈ వీడియో అప్లోడ్ అయినట్లు గుర్తించి అతనికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.