ఒక్క అంగుళం కూడా వదులుకోం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ సైనికులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా భారత్ రాజీపడబోదని తేల్చిచెప్పారు.
దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ సైనికులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా భారత్ రాజీపడబోదని తేల్చిచెప్పారు.
దీపావళి సందర్భంగా అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుక రెండు గిన్నీస్ రికార్డులు దక్కాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హరతిని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నీస్ రికార్డు వరించింది.
దీపావళి పండగపూట ఓ మందుబాబు రెచ్చిపోయాడు. తాను అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని లిక్కర్ షాపుకే నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు రూ. 2లక్షల విలువైన మద్యం బుగ్గిపాలైంది. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ అన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన ఏపీలోని విశాఖలో చోటుచేసుకుంది.
టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా కళ్లద్దాలు ధరించడం చాలా బెటర్. దీని వల్ల కళ్లకు సేఫ్టీ ఉంటుంది. పెద్దవాళ్లే కాదు..పిల్లలకు కూడా కళ్లజోళ్లు పెట్టాలి.
దీపావళి రోజున దక్షిణ దిశలో దీపం వెలిగించడం అంత మంచిది కాదు. ఈ దిక్కును యమధర్మ రాజు దిక్కుగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిక్కున దీపం వెలిగిస్తే జీవితంలో లేనిపోని కష్టాలు వచ్చి చేరాతాయని పండితులు వివరిస్తున్నారు.
దీపావళి లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి 11 పసుపు గవ్వలను సమర్పించాలి. పూజ చేసిన తరువాత ఈ గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, అల్మారాలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
పండుగ అనేది తన కోసం మాత్రమే కాదు..అందరి కోసం. కాబట్టి పాటించే నియమాలు అన్ని కూడా తన అభ్యున్నతితో పాటు..సమాజ అభ్యున్నతికి పాటు పడాలి.
ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి దీపావళి పండుగ నాడు స్వామిని ఆరాధించడం మంచిది. అభ్యంగన స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, కాలుష్య కారకాలు, టాక్సిన్స్, మృతకణాలు తొలగిపోతాయి