Wagner Group Chief Died : వాగ్నర్ గ్రూప్ చీఫ్ మృతి? రష్యాలో ప్లేన్ క్రాష్.. అసలేం జరిగింది.?
రష్యాలో పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించారా? పలు అంతర్జాతీయ వార్త సంస్థలు ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి.రష్యాలో బుధవారం ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, ప్రైవేట్ విమానం మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తుండగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన యవ్జెనీ ప్రిగోజిన్ ఈ విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.