పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి...
మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి మొదటగా హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు.
మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి మొదటగా హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
బీజేపీ మరో హిందుత్వ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెడుతుందా? రాజస్థాన్ లో బాబా బాలక్‌నాథ్ ను యూపీలో యోగి ఆదిత్యనాధ్ దారిలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం కావడంతో ఈ ప్రచారం మొదలైంది.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారంపై స్పందించిన కోమటిరెడ్డి, డీకే శివకుమార్ లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత తదుపరి కార్యాచరణను కేంద్ర అధినాయకత్వం నిర్ణయం మేరకు తీసుకుంటామని తెలిపారు.
ఛత్తీస్‌ఘడ్ లో మహదేవ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. దీని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందిస్తూ నవంబర్ 17 వరకు ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్ చేశారు. దీనిద్వారా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఛత్తీస్ ఘడ్ లో మరో రెండు రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘేల్ కు రూ.508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ పత్రాలను దేవుడి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించాలని పట్టుబట్టారు రఘురామ కృష్ణంరాజు . జగన్ కేసుల విచారణలో తీవ్రజాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.