Musi River: మూసీ నది ప్రక్షాళనకు రూ.4 వేల కోట్లు.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి!
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను నింపే పనుల కోసం రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.