TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు!
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కొత్త టీచర్లను నియమించే ప్రక్రియలో వేగం పెంచింది రేవంత్ సర్కార్. మరో రెండు నెలల్లో 11,062 టీచర్, 1,392 ఇంటర్, 544 డిగ్రీ, 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.