ఆ అమ్మాయి జాతకం ఇదే! | Producer Natti Kumar On Jani Master Release | Assistant Choreographer Girl
జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. జానీ కేసు సినీ ఇండస్ట్రీపై తప్పుడు సంకేతాలను సృష్టించింది. ఎప్పుడో లైంగికంగా వేధిస్తే ఇప్పుడు ఆరోపణలు చేయటం ఏంటి? ఆరోపణలు చేసిన అమ్మాయికి ఏ నిర్మాత ఆఫర్స్ ఇస్తాడు? అని అన్నారు.
జానీమాస్టర్ వివాదంపై ఫిలిం చాంబర్ లోని పలువురు రెస్పాండ్ అయ్యారు. కొందరు జానీ మాస్టర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా.. మరికొందరు మాత్రం ఆయన్ను తప్పు బడుతూ చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇండస్ట్రీ కాస్త రెండుగా చీలిపోయింది.
మెగా బ్రదర్ నాగబాబు చేసిన వరుస ట్వీట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు. విన్న ప్రతిదీ నమ్మొద్దు అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్లు జానీ మాస్టర్ కేసు గురించేనా? అని చర్చ జరుగుతోంది.