'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి
అక్కినేని జాతీయ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తనకి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఏఎన్ఆర్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమని చిరంజీవి అన్నారు. రచ్చ గెలిచి ఇంట గెలిచానన్నారు.
Chiranjeevi : ఊహించని డైరెక్టర్ తో చిరంజీవి సినిమా?
'విశ్వంభర' తర్వాత చిరంజీవి.. ప్రముఖ రచయిత BVS రవితో సినిమా చేయనున్నారట. ఈ విషయాన్నిBVS రవి స్వయంగా మీడియాతో పంచుకున్నారు. సామాజిక అంశాలతో ముడిపడిన చిత్రాల్లో ఆయన నటిస్తే విశేషంగా ఆదరించారు. మేం కూడా ఆయనతో అలాంటి చిత్రమే చేయాలనుకుంటున్నామని తెలిపారు.
సీఎం చంద్రబాబుని కలిసిన చిరంజీవి.. కారణం ఏంటంటే?
ఏపీ సీఎం చంద్రబాబుని టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్‌తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల చెక్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. చిరంజీవి, రామ్ చరణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Vishwambhara : విజువల్ వండర్ గా 'విశ్వంభర' టీజర్.. రెక్కల గుర్రంపై చిరు ఎంట్రీ అదుర్స్
చిరంజీవి 'విశ్వంభర' టీజర్ ను దసరా కానుకగా నేడు రిలీజ్ చేశారు. టీజర్ లో చూపించిన విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చిరంజీవి తెల్లని రెక్కల గుర్రంపై వచ్చే ఎంట్రీ షాట్ మాత్రం అదిరిపోయింది. ఇక కీరవాణి బీజియం టీజర్ మొత్తానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సంక్రాంతి రేస్ నుంచి 'విశ్వంభర' అవుట్.. కారణం అదే
'విశ్వంభర' మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దాని స్థానంలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వచ్చి చేరింది. 'గేమ్ ఛేంజర్' మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు.
'విశ్వంభర' సెట్స్ లో వెంకీ మామ సందడి.. ఫొటోలు వైరల్
'విశ్వంభర' మూవీ సెట్స్ లో విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. ఆయనతో పాటూ అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ సైతం మెగాస్టార్ ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు
'విశ్వంభర' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ గెట్ రెడీ
మెగాస్టార్ 'విశ్వంభర' సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. దసరా సందర్భంగా రేపు ఉదయం 10:49 గంటలకు టీజర్ రాబోతుందని సరికొత్త పోస్టర్ తో తెలిపారు మేకర్స్. ఈ పోస్టర్ లో చిరు కత్తి పట్టుకొని ఉన్న లుక్ టీజర్ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.